వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద.కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లు దండగ: పరీక్షలను నిలిపివేసిన సర్కార్..కొత్త వివాదం

|
Google Oneindia TeluguNews

జైపూర్: కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లు తేడా కొడుతున్నాయి. పది నిమిషాల్లోనే ఫలితాలు తెలుస్తాయంటూ అదే పనిగా దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక ఛార్టెడ్ విమానాల ద్వారా తెప్పించిన ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా ఫలితం లేదని తేలిపోయింది. దీనితో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వైరస్ ఫలితాలను నిలిపివేసింది రాజస్థాన్ ప్రభుత్వం. రాజస్థాన్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.

పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ: కరోనా వేళ రోజా కలకలం: సొంత పార్టీ నుంచే..!పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ: కరోనా వేళ రోజా కలకలం: సొంత పార్టీ నుంచే..!

 5.4 శాతం మాత్రమే..

5.4 శాతం మాత్రమే..


ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా 5.4 శాతం మాత్రమే నిఖార్సయిన ఫలితాలు వెలువడుతున్నాయని రఘుశర్మ తెలిపారు. 90 శాతం వరకు ఫలితాలు తాము ఆశించిన విధంగా లేవని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా పరీక్షలను నిర్వహించిన తరువాతే.. ఈ కిట్స్ వల్ల ఉపయోగం లేదని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. వాటిని పరీక్షించడానికి ప్రత్యేకంగా డాక్టర్లతో కూడిన నిపుణుల బృందాన్ని సైతం నియమించామని అన్నారు. సవాయ్ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరోనా వైరస్ పేషెంట్లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షలను నిర్వహించామని, ఫలితాలు ఆశించిన విధంగా లేవని చెప్పారు.

ఐసీఎంఆర్‌కు లేఖ..

ఐసీఎంఆర్‌కు లేఖ..

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వైరస్ పరీక్షలను నిలిపివేసిన విషయాన్ని తాము ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు తెలియజేశామని అన్నారు. దీనికోసం ఆ సంస్థ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఐసీఎంఆర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. మొత్తం 168 కిట్ల ద్వారా పరీక్షలను నిర్వహించగా..వాటన్నింట్లోనూ తేడాలు వచ్చాయని వెల్లడించారు. పాజిటివ్‌గా నిర్ధారించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు నిర్వహించిన పరీక్షల్లో ఈ కిట్స్ నెగెటివ్‌గా చూపించాని అన్నారు.

మూడో రోజే తేడా..

మూడో రోజే తేడా..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతోన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఈ ఎడారి రాష్ట్రంలో 1478 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14 మంది మరణించారు. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దక్షిణ కొరియా నుంచి పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించింది. శుక్రవారం నుంచి వాటి వినియోగాన్ని ఆరంభించింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం.. ఈ పరీక్షలు కొనసాగాయి. సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా తేడాలొచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది.

జగన్ సర్కార్ ఏం చేస్తుంది?

జగన్ సర్కార్ ఏం చేస్తుంది?

ఒక్క రాజస్థాన్ ప్రభుత్వం మాత్రమే కాదు.. ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించాయి. ఏపీలో ఈ కిట్ల ధరపై ఒకవంక రాద్ధాంతం నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 330 రూపాయలకే ఈ కిట్లను తెప్పించిందని, ఏపీ ప్రభుత్వం 730 రూపాయలను వ్యయం చేసిందని, ఈ మొత్తం అంతా అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్లిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీ కంటే ఎక్కువ రేటుకు అంటే 795 రూపాయలకు ఈ కిట్లను తెప్పించింది. రాజస్థాన్ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిన నేపథ్యంలో.. మిగిలిన రాష్ట్రాలు ఏం చేస్తాయనేది కొత్త దుమారానికి తెర తీసే అవకాశాలు లేకపోలేదు.

Recommended Video

Watch Women Spit In Polythene Bags, Throw It In Houses Ahead of Coronavirus Spread

English summary
The Rajasthan government on Tuesday stopped using rapid testing kits for coronavirus after they delivered inaccurate results and informed the Indian Council of Medical Research (ICMR) about the issue. The state's health minister Raghu Sharma said the kits gave only 5.4 per cent accurate results against the expectation of 90 per cent accuracy and therefore the kits were of no benefit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X