ఫస్ట్ డోస్ అయితే 10 శాతం, రెండోది తీసుకుంటే 20 శాతం.. ఓ హోటల్ వినూత్న ఆలోచన
కరోనాకు విరుగుడు టీకానే. ఇంత ప్రచారం చేసి, అవగాహన కల్పిస్తోన్న కొందరు మాత్రం టీకాలు వేసుకోవడం లేదు. అలాంటి వారి కోసం కొన్ని రెస్టారెంట్లు ఆఫర్ ప్రకటించాయి. వ్యాక్సిన్ వేసుకున్నారో మీకు రాయితీ ఉంటుంది. డోసుల వారీగా కూడా డిస్కౌంట్ ఉంటుంది. రాజస్తాన్‌లో ఓ హోటల్ ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
రాజస్తాన్ జోధ్‌పూర్‌లో వెదిక్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ ఉంది. జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే బిల్లులో 10 శాతం రాయితీ అని ప్రకటించింది. అదే రెండు డోసులు తీసుకుంటే 20 శాతం అని తెలియజేసింది. ఈ ఆఫర్ మంచిదే.. ఎందుకంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయనుంది. కరోనా టీకాను జనం వేసుకునేలా ప్రోత్సహించేందుకు ఆఫర్ ప్రకటించామని రెస్టారెంట్ యాజమని తెలిపారు. ఇదే కాదు రాజస్తాన్‌లో పలు కంపెనీలు ఇలా ఆఫర్ ప్రకటిస్తున్నాయి.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.












Click it and Unblock the Notifications