Rajasthan Polls: రాజస్తాన్ లో ప్రచారానికి కాసేపట్లో ముగింపు-మోడీ-గెహ్లాట్ పోరులో గెలిచేదెవరు ?

ఉత్తరాది రాష్ట్రం రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. రాజస్తాన్ లోని 200 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 25న పోలింగ్ జరగబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ఆశలు పెట్టుకున్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే. దీంతో ప్రధాని మోడీ ఇక్కడ తీవ్రంగా ప్రచారం చేశారు.

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఇచ్చింది. ఇందులో కులగణనతో పాటు పలు హామీలిచ్చింది. తద్వారా రాష్ట్రంలో అత్యధిక బీసీల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ దీన్ని కౌంటర్ చేసేందుకు గెహ్లాట్ సర్కార్ లో మహిళలపై దాడులు, అవినీతి వంటి అంశాల్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రసంగాల్లో గెహ్లాట్ ను పదే పదే టార్గెట్ చేయడంతో మిగతా అంశాలన్నీ పక్కకు వెళ్లిపోతున్నాయి.

Rajasthan Polls: who will in modi versus gehlot fight as campaign concludes today

రాజస్తాన్ లో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన అశోక్ గెహ్లాట్ కూ, సీఎం పదవిపై ఆశ పెట్టుకుని విఫలమైన సచిన్ పైలట్ కూ మధ్య పోరు నడిచింది. అయితే ఎన్నికల వేళ ఆ ప్రభావం పార్టీ అవకాశాలపై పడకుండా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. అయినా పైలట్ సామాజికవర్గమైన గుజ్జర్లతో పాటు ఎస్టీలు, ముస్లింలు కూడా ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. అయితే వీరంతా బీజేపీకి ఓటు వేయకపోయినా కాంగ్రెస్ కు దూరంగా ఉంటే చాలు ఆ పార్టీకి కష్టాలు తప్పవు. ఇందులో గుజ్జర్లు మాత్రం కాంగ్రెస్ పై కోపంతో బీజేపీవైపు మొగ్గే అవకాశముంది.

అందుకే ప్రధాని మోడీ.. గెహ్లాట్, పైలట్ పోరును పదే పదే జనాల్లోకి పంపేందుకు ప్రయత్నించారు. అలాగే మహిళలపై పెరిగిన దాడులు, ఇతర వర్గాల పరిస్ధితులు, కులం వంటి అంశాలను ప్రస్తావించారు. దీంతో మోడీ వర్సెస్ గెహ్లాట్ గా మారిపోయిన ఈ పోరు స్ధానిక బీజేపీ నేతల్ని డమ్మీలుగా మార్చేసింది. ఇప్పుడు గెహ్లాట్ కావాలా మోడీ సర్కార్ కావాలా అన్నట్లు పరిస్ధితి మారింది. తాజా పరిమాణాలపై చికాకుగా ఉన్న గెహ్లాట్.. మోడీ రాజస్తాన్ ఎన్నికల్ని లోక్ సభ ఎన్నికల్లా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా గెహ్లాట్ వర్సెస్ మోడీగా మారిన పోరులో ఓటర్లు ఎవరిని ఆదరించబోతున్నారో ఎల్లుండి తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+