గుర్మీత్ ఫినిష్.. ఇప్పుడు ఫలహార బాబా! లైంగిక దాడి కేసులో అరెస్టు చేసిన పోలీసులు!

లైంగిక దాడి కేసులో రాజస్థాన్‌కు చెందిన ఫలహార బాబాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 21 ఏళ్ల భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాబాపై ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల విచారణ తర్వాత బాబాను పోలీసులు ఆధీ

అల్వార్: లైంగిక దాడి కేసులో రాజస్థాన్‌కు చెందిన ఫలహార బాబాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 21 ఏళ్ల భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాబాపై ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల విచారణ తర్వాత బాబాను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆరోగ్యం సరిగా లేదంటూ ఇటీవల ఫలహార బాబా అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.

కౌశలేంద్ర ప్రసన్నాచార్య ఫలహార మహారాజ్ (70) రాజస్థాన్‌లో ఫేమస్ బాబా. ఆహారంగా కేవలం పండ్లు తీసుకుంటాడని, ఆయనకు ఆ పేరు వచ్చింది. ఫలహార బాబా ఆగస్టు ఏడోతేదీ రాత్రి గదికి పిలిపించుకుని తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆశ్రమంలోని ఓ భక్తురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rajasthan's 'Falahari Baba' Arrested On Charges Of Rape

ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాబాను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వెళ్లగా ఆయన హైబీపీతో బాధపడుతూ దవాఖానలో చేరినట్టు సిబ్బంది తెలిపారు.

దీంతో దవాఖానలో చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు. అత్యాచార ఆరోపణలు చేసిన సదరు యువతి బాబా సిఫారసుతో ఢిల్లీలోని ఓ సీనియర్ లాయర్ వద్ద జూనియర్‌గా చేరిందట.

విరాళం ఇచ్చేందుకు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. ఫలహార బాబాకు దేశ, విదేశాల్లోనూ భక్తులున్నారు. ఆయన ఆశీర్వాదం కోసం ప్రముఖులు సైతం బారులు తీరుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+