వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత ఘోరమా: రేఖ, సచిన్‌లపై రాజీవ్ శుక్లా ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏం చేస్తున్నాడనేది ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. కానీ ఐపియల్ మాజీ చీఫ్, కాంగ్రెసు అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా నుంచి సచిన్ టెండూల్కర్ విమర్శలను ఊహించి ఉండకపోవచ్చు.

రాజ్యసభ సమావేశాలకు సరిగా రాకపోవడంపై సచిన్ టెండూల్కర్ మీద, సినీ తార రేఖ మీద రాజీవ్ శుక్లా మండిపడ్డారు. పార్లమెంటుకు సరిగా రాలేనప్పుడు రాజ్యసభ సభ్యత్వాలను ఎందుకు అంగీకరించాలని రాజీవ్ శుక్లా ప్రశ్నించినట్లు ఓ న్యూస్ చానెల్ వ్యాఖ్యానించింది.

Rajeev Shukla slams Sachin Tendulkar over poor attendance in Rajya Sabha

తాను గత వారం సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడానని, సభకు రావాలని అడిగానని, వస్తానని సచిన్ టెండూల్కర్ చెప్పారని రాజీవ్ శుక్లా వివరించారు. సచిన్ టెండూల్కర్, రేఖ సభకు వస్తారని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని టెండూల్కర్ చెప్పినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశాల్లో సచిన్ టెండూల్కర్ హాజరు కేవలం ఐదు శాతం మాత్రమే. సచిన్ టెండూల్కర్ గత రెండు నెలలుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గానీ పార్లమెంటు సమావేశాలకు మాత్రం సరిగా హాజరు కావడం లేదు.

English summary
While Sachin Tendulkar has always remained under scrutiny for whatever he did on and off the field, he would not have expected a criticism from Rajeev Shukla, an ex-IPL chief and Congress spokesperson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X