శబరిమల ఘటనపై వినూత్న నిరసన.. సగం మీసం తీసేసిన వైనం
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్ప భక్తుల ఆందోళనలతో పాటు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఒక కేరళలోనే కాక దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈక్రమంలో తిరువనంతపురం ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు. సగం మీసం తీసేసి వార్తల్లో నిలిచారు. ఇతను ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడని తెలుస్తోంది.
ఇటీవలే సోషల్ మీడియాలో రాజేశ్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయ్యప్ప మాల ధరించి తలపై ఇరుముడి పెట్టుకున్నట్లు ఉన్న తనను పోలీస్ తన్నినట్లుగా ఫోటో క్రియేట్ చేశారు రాజేశ్. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సగం మీసం తీసేసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications