ఆ రోజు కొత్త పార్టీ ప్రకటించనున్న రజనీకాంత్?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. తన పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12వ తేదీన ఆయన కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.

తమిళనాడులో ప్ర‌స్తుతం నెల‌కొన్న‌ రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా ర‌జ‌నీ ఇక రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ర‌జనీ త‌న అభిమానుల‌తో భేటీ అవుతుండ‌డం కూడా ఊహాగానాల‌కు బ‌లం చేకూర్చింది.

rajinikanth

ఈ క్రమంలో ర‌జ‌నీకాంత్‌ తన పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌ 12న కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆయ‌న అభిమానుల డిమాండ్ 20 ఏళ్ల నుంచి ఉంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఈ అంశంపై రజనీకాంత్ పై ఒత్తిడి మ‌రింత పెరిగింది. ఇటీవ‌ల అభిమానుల‌ను క‌లిసిన త‌రువాత రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు వ్యాఖ్యానించారు.

అందుకు సంబంధించి పార్టీ పేరు, జెండా, ఎజెండాల‌పై ర‌జ‌నీ చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు, బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ సేవలను కూడా ర‌జ‌నీ తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయ.తమిళనాడు పరిస్థితులపై, ఓటింగ్‌ సరళిని ఆ ఏజెన్సీ అధ్యయనం చేస్తోందని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajinikanth is likely to discuss his political future in a concrete manner when he meets his fans in August, sources close to the actor said.
Please Wait while comments are loading...