పళ్లు ఊడిపోయినా నటిస్తూనే ఉంటారు..రజనీకాంత్‌పై తమిళనాడు ప్రభుత్వం సెటైర్లు

సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి దురై మురుగన్ కౌంటరిచ్చారు. అసలేం జరిగిందంటే..ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ మంత్రి దురై మురుగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ (డీఎంకేలో) చాలామంది పాత విద్యార్థులు ఉన్నారు.

పైగా వాళ్లేమీ సాధారణ విద్యార్థులు కాదు... ఎవరికి వారే అసాధారణమైన పాత విద్యార్థులు. వీళ్లంతా కూడా ర్యాంకులు కోసం పోటీపడుతుంటారు. కానీ తరగతి గదిని మాత్రం విడిచిపోరు. సరిగ్గా చెప్పాలంటే... దురై మురుగన్ కూడా అలాంటి పాత విద్యార్థే. ఇంతకుమించి ఇంకేం చెప్పగలం. అయితే, స్టాలిన్ సర్ (సీఎం)... మీరు పాత విద్యార్థులను కూడా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు... మీకు హ్యాట్సాఫ్" అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

Rajinikanth Durai Murugan Controversy

అంటే దురై మురుగన్ ఎప్పటి నుంచో డీఎంకే పార్టీనే అంటిపెట్టుకున్నారనే ఉద్దేశంతో రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే చిత్రసీమలో కూడా ఉంది. గెడ్డాలు పెరిగిపోయి, పళ్లూడిపోయి బోసి నోటితో కూడా నటించే ముసలి నటులు ఉన్నప్పుడు యువ కళాకారులు అవకాశాలు కోల్పోతున్నారని మేం కూడా చెప్పగలమని రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ కౌంటర్ ఇచ్చారు.

అయితే మంత్రి దురై మురుగన్ తనపై చేసిన వ్యాఖ్యలను రజనీకాంత్ తేలిగ్గా తీసుకున్నారు.దురై మురుగన్ తన గురించి మాట్లాడిన మాటలను తాను పట్టించుకోబోనని, తామిద్దరం ఎప్పటి నుంచో స్నేహితులమని, తమ స్నేహం ఇక ముందు కూడా కొనసాగుతుందని రజనీకాంత్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+