కౌంట్‌డౌన్ రెండు రోజులే: రజనీకాంత్ పార్టీ పేరు ఇదేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu
  రజినీ రాజకీయ రంగ ప్రవేశం పక్కా..!

  చెన్నై: తన రాజకీయ ప్రవేశం గురించి కాలమే నిర్ణయిస్తోందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశం గురించి తమిళ సూపర్ స్టార్ డిసెంబర్ 31వ, తేదిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

  తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం నాడు నాలుగో రోజున అభిమానసంఘాలతో సమావేశమయ్యారు. వరుసగా అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశమౌతున్నారు.కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో నాలుగు రోజు శుక్రవారం కోయంబత్తూరు, ఆరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు.

  రాజకీయాల్లోకి రజనీకాంత్ వస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో అభిమాన సంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీకాంత్ డిసెంబర్ 31వ, తేదిన ప్రకటన చేయనున్నారు.

  రాజకీయాల్లోకి ప్రవేశం కాలమే నిర్ణయిస్తోంది

  రాజకీయాల్లోకి ప్రవేశం కాలమే నిర్ణయిస్తోంది

  రాజకీయాల్లోకి ప్రవేశాన్ని కాలమే నిర్ణయిస్తోందని తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.సినీ నటులు రాజకీయాల్లో రాణిస్తారని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం కోయంబత్తూరు, ఆరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  ఇంకా రెండు రోజులే ఉంది

  ఇంకా రెండు రోజులే ఉంది

  ఇంకా రెండు రోజులే ఉందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలంటే కాలం, సమయం ముఖ్యమన్నారు. మొన్న శివాజీగణేషన్, నిన్న నేను, ఈరోజు మరోకరన్నారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతోందని రజనీకాంత్ చెప్పారు. ఇంకా రెండు రోజులే ఉందన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పారు.

  తరం మారింది

  తరం మారింది

  తరం మారిందని రజనీకాంత్ అభిప్రాయపడడారు. నాడు ఎంజీఆర్ నటుడైనా రాజకీయాల్లో రాణించారని చెప్పారు. నిబద్దతతో వ్యవహరించారని ఆయన గర్తు చేశారు. అయితే తరం మరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కొత్త తరం వచ్చిందన్నారు. కొత్త తరానిదే భవిష్యత్ అని చెప్పారు.రజనీ పేరవై పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

  కుటుంబంపై దృష్టి పెట్టండి

  కుటుంబంపై దృష్టి పెట్టండి

  తల్లిదండ్రులను, కుటుంబంపై దృష్టిపెట్టాలని అభిమానులకు రజనీకాంత్ సూచించారు. తద్వారా సమాజం బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తమిళనాడు వాసులే కాదు దేశం మొత్తం రజనీకాంత్ డిసెంబర్ 31న ఏం చెబుతారనే విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tamil Super Star Rajinikanth is meeting his fans on the fourth day on Friday, at Chennai. Thousands of fans from Puducherry, Kadaluru and Karekal are thronging the venue of the meeting from the past three days. Rajinikanth has said that if God is willing.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి