మళ్ళీ రాజకీయాల్లోకి రజనీకాంత్ : మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్లతో భేటీ, రీ ఎంట్రీపై తేల్చేస్తానన్న తలైవా !!
గత తమిళనాడు ఎన్నికలకు ముందు తమిళ రాజకీయాలలో సంచలనం సృష్టించేందుకు రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో రాజకీయాల నుండి వైదొలుగుతానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టివ్ పాలిటిక్స్ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఆయన అభిమానులు ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక మళ్లీ మరోమారు తమిళనాడు రాజకీయాల్లో రీఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తలైవా పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తికర చర్చ
తమిళనాడులోని అభిమాన సంఘాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ సమావేశం కావడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. తలైవా రజనీకాంత్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారా, ఆయన ఈసారి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో కొనసాగాలని డిసైడ్ అయ్యారా అన్న చర్చ తాజాగా కొనసాగుతోంది. ఇదే సమయంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తాను రాజకీయాల్లోకి రానని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్న రజనీకాంత్ వ్యాఖ్యలు ఆ ఆసక్తికి కారణంగా మారాయి

మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో సమావేశం నేపధ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి
మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో సమావేశం కానున్న నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నదానిపై చర్చిస్తానని పేర్కొనడం ఇప్పుడు రజనీకాంత్ పొలిటికల్ జర్నీ పై మరోమారు ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే రజనీకాంత్ ని పాలిటిక్స్ లోకి రావాలని చాలామంది అడిగిన నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది . రజనీకాంత్ మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్ లతో నేడు సమావేశం నిర్వహించడం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. ఇక అభిమాన సంఘాల నాయకులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

ఆరోగ్యంగా చెన్నై చేరుకున్న తలైవా .. నేడు కీలక భేటీ
ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ మరోమారు అభిమాన సంఘం నేతలను కలుస్తున్న నేపథ్యంలో శుక్రవారం చెన్నై కి చేరుకున్నారు. అనారోగ్య కారణాలతో ఇటీవల అమెరికా వెళ్ళిన రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి చెన్నైకి చేరుకున్న నేపథ్యంలో జరుగుతున్న తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది. 70 ఏళ్ల వయసులో రాజకీయ పార్టీని ప్రారంభించాలని గత డిసెంబర్లో ప్రయత్నం చేసిన రజనీకాంత్ అనారోగ్య కారణాలతో తాను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే .

రాజకీయాల్లోకి రానన్న రజనీ కాంత్ .. మళ్ళీ రీ ఎంట్రీ పై ఊహాగానాలు
రాజకీయాల్లో లేకుండానే తాను ప్రజలకు సేవ చేస్తానని, తన నిర్ణయం తన అభిమానులకు బాధ కలిగించినా తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దయచేసి అందరూ తనను క్షమించాలని రజనీకాంత్ ప్రకటన చేశారు. అప్పుడు రజనీకాంత్ చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశానికి తెర పడినట్లేనని అందరూ భావించారు. ఇక తాజాగా రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరోమారు దుమారం మొదలైంది. ఇక పొలిటికల్ రీఎంట్రీ పై తేల్చేస్తా అంటున్న తలైవా ఏం తేలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications