ఉద్యమాలు చెయ్యడానికి నేనే సిద్దంగా ఉన్నా, భవిష్యత్తులో, అందుకే: రజనీకాంత్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: రాజకీయాల్లో విజయం సాధించాలంటే మీడియా పాత్ర ముఖ్యమని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. మీడియా ప్రధాన్యత ఇవ్వకుంటే ఎవ్వరూ రాజకీయాల్లో రాణించలేరని, అది సాధ్యం కాదని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరు సహకరించడం వలనే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, భవిష్యత్తు, భావితరాలకోసం ఉద్యమాలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని రజనీకాంత్ చెప్పారు.

మీట్ అండ్ గ్రీట్

మీట్ అండ్ గ్రీట్

చెన్నైలోని ఎగ్మూరు రైల్వేస్టేషన్ సమీపంలోని స్టార్ హోటల్ లో మీడియా కోసం మంగళవారం రజనీకాంత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ గతం గుర్తు చేసుకున్నారు.

మీడియాలో పని చేశా !

మీడియాలో పని చేశా !

తాను రెండు నెలలు కర్ణాటక మీడియాలో పనిచేశానని రజనీకాంత్ చెప్పారు. అయితే సినీరంగంలో ఓ స్థాయిలో ఉన్న తాను ప్రస్తుతం మీడియాను ఎలా హ్యాండిల్‌ చేయ్యాలో తెలియడం లేదని రజనీకాంత్ అన్నారు.

క్షమించండి

క్షమించండి

రాజకీయాలకు నేను కొత్త, తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి అని రజనీకాంత్ మీడియాకు మనవి చేశారు. మీడియా వల్లే నేను ఇంతవాడినయ్యానని ఈ సందర్భంలో రజనీకాంత్ చెప్పారు.

స్వాతంత్ర పోరాటం

స్వాతంత్ర పోరాటం

1947లో జరిగిన స్వాతంత్ర పోరాటంలో తమిళనాడు కీలకపాత్ర పోషించిందని రజనీకాంత్ గుర్తు చేశారు. అనేక ఉద్యమాలు తమిళనాడు నుంచి మొదలైనాయని, ఇక ముందు మరన్ని ఉద్యమాలు మొదలౌతాయని రజనీకాంత్ జోస్యం చెప్పారు.

భావితరాల కోసం

భావితరాల కోసం

భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం అనేక ఉద్యమాలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీకాంత్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకు సహకరిస్తే కచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తానని, తమిళనాడును మరింత అభివృద్ది చేస్తానని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajinikanth said that, Tamil Nadu has been historically been a place of major political happenings. I too want to create a political revolution. If there is a change now, future generations will live better: Rajinikanth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి