రాజీవ్ హత్య: నళినీ పిటిషన్‌ను తిరస్కరంచిన సుప్రీం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళినీ శరణ్ దాఖలు చేసుకున్న ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. శిక్షకాలం కంటే ముందుగా విడుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, నళినీ శరణ్ ప్రస్తుతం తమిళనాడులోని వెల్లోర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తోంది.
రాజీవ్ హత్య కేసులో ఇతర నిందితులైన ఏజి పెరివాలన్, శ్రీలంక జాతీయులు మురుగన్, శాంతన్‌లకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిందితుల క్షమాభిక్ష కేంద్రం పరిశీలనలో ఉండటంతో ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోందని కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
రాజీవ్ హత్య కేసులో నిందితులైన ఈ నలుగుర్ని విడుదల చేస్తామని ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు బెంచ్ అందుకు అంగీకరించకపోవడంతో నిందితుల విడుదల నిలిచిపోయింది.

1998లో రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన వీరిపై ఉగ్రవాదం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల(నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురుకి మరణ శిక్షపడగా, మరో నలుగురికి జీవిత ఖైదు విధించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందారు.
రాజీవ్ హత్య కేసుతో సంబంధం ఉన్న నళినీ, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాగా, హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ నళినీ 18ఏళ్లుగా జైల శిక్ష అనుభవిస్తోందని ఆమె తరపు న్యాయవాది దురైస్వామి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications