రిపబ్లిక్ డే: ఒబామా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత్‌కు రానున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భద్రతపై ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుజాతా సింగ్, ఆర్మీ ఛీప్ దల్బీర్ సింగ్ సుహాగ్‌తో పాటు ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Rajnath Singh reviews security situation ahead of US President Barack Obama visit

జనవరి 26న జరగనున్న రిపబ్లికే డే ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడి బరాక్ ఒబామా ముఖ్య అతిధిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తన అమెరికా పర్యటనలో ఒబామాను రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆహ్వానించడం, దానికి ఆయన అంగీకరించిన సంగతి తెలిసిందే.

సమావేశం అనంతరం ఆర్మీ ఛీప్ దల్బీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లను సమీక్షించినట్లు పేర్కొన్నారు. గత ఆదివారం బెంగుళూరులోని ఓ రెస్టారెంట్‌లో బాంబు పేలుడు ఘటనతో పాటు, అసోంలోని బోడో తీవ్రవాదులకు.. ఆదివాసీలకు మధ్య జరిగిన హింసాకాండపై కూడా చర్చించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+