భారత క్షిపణి వ్యవస్థ అంత్యంత సురక్షితమైంది : ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌లో పడిన మిస్సైల్..!! రాజ్‌నాథ్ సింగ్
భారతదేశ క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ, భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. ఈ విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మనదేశానికి చెందిన క్షిపణి ఈ నెల 9 తేదిన ప్రమాదవశాత్తు దూసుకెళ్లి పాకిస్థాన్‌లో పడింది. ఈ సంఘటనపై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
Recommended Video

ప్రమాదవశాత్తు క్షిపణి ఫైర్
రోజువారిలో భాగంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సభలో రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రమాదవశాత్తు క్షిపణి ఫైర్ అయిందన్నారు. అయితే ఆ మిస్సైల్ కాస్త దూసుకెళ్లి పాకిస్థాన్ భూభాగంలో పడినట్లు గుర్తించామని తెలిపారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తాము పార్లమెంటు వేదికగా ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మన క్షిపణి వ్యవస్థ అంత్యంత పటిష్టమైంది
ఈ ప్రమాదంపై లోపాలను గుర్తించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత దేశ క్షిపణి వ్యవస్థ అంత్యంత పటిష్టమైనది. మన సాయుధ దళాలు అంత్యంత క్రమశిక్షణగలవారని, సుశిక్షితులని పేర్కొన్నారు. క్షిపణి వ్యవ్యస్థను సమర్థవంతంగా నిర్వహించగలిగే సత్తా, అనుభవం సాయుధ దళాలకు ఉందని తెలిపారు. ప్రమాదవశాత్తు మన క్షిపణి దూసుకెళ్లి పాకిస్థాన్ లో పడింది తప్ప దీంతో ఎలాంటి సందేహాలకు తాములేదని స్పష్టం చేశారు. ఇది ఖండించదగ్గ విషయమన్నారు. ఉన్నత స్థాయి విచారణలో మిస్సైల్ రిలీజ్ కు గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

భారత రాయబారికి పాక్ సమన్లు
ఈ ఘటనపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం తమ గగనతలంలో ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది. పాక్‌లో ఉన్న భారత రాయబారికి సమన్లు కూడా జారీ చేసింది. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి , వాస్తవాలను తెలియజేస్తామని భారత రాయబారి వారికి స్పష్టం చేశారు. అటు దీనిపై భారత్ రక్షణశాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఈ సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఇప్పటికే దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications