వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు: రాజ్యసభలో నేడు ప్రకటన చేయనున్న రాజ్‌నాథ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ఓ ప్రకటన చేయనున్నారు. మంగళవారం ఆయన లోక్‌సభలో సరిహద్దు ఉద్రిక్తలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

లడఖ్‌లో వాస్తవ పరిస్థిని ప్రభుత్వం వివరించాలంటూ ప్ల కార్డులతో సభలో నిరసనకు దిగారు. బుధవారం కూడా సభలో పలువురు సభ్యులు దీనిపై పట్టుబట్టడంతో ఈ అంశంపై రాజ్యసభ్యలో స్పష్టతనివ్వాలని రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో ఆయన ప్రకటన చేయనున్నారు.

 Rajnath Singh to address Rajya Sabha on India-China border issue today

కాగా, చైనాతో సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన గురించి మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టామని అన్నారు.

దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ిన కాపాడేందుకు ఎంత వరకైనా తెగిస్తామని, ఇందులో ఏ మాత్రం అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. చైనా కవ్వింపు చర్యలను ఉపేక్షించేది లేదని, భారత సైనిక దలాలు సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని డ్రాగన్ దేశానికి గట్టి హెచ్చరిక చేశారు.

English summary
Defence Minister Rajnath Singh will address the Rajya tomorrow, issuing a statement on the border tussle with China at 12 noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X