అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ పై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని భారత్ లో పాకిస్థాన్ అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతోందని.. ఒకవేళ అలాంటివి ఏమైనా పాల్పడితే ఆ దేశానికి భారత్ ఇచ్చే సమాధానం అతి భయంకరంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా పాకిస్థాన్ పై రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైనిక్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ మేరకు పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలను అడ్డుపెట్టుకుని భారత్ లో ఎలాంటి దాడులకు ప్రయత్నించినా భారత్ రియాక్షన్ పాకిస్థాన్ తట్టుకోలేదని స్పష్టం చేశారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో మన సరిహద్దు దేశం.. భారత్ లో ఏదో సాహాసోపేతమైన చర్య చేయాలని ప్లాన్ వేస్తోంది. ఒకవేళ అదే గానీ జరిగితే భారత్ రియాక్షన్ ఊహించుకోలేని విధంగా ఉంటుంది" అని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే భారత్.. ఆ దేశాన్ని ఎలా మోకాళ్లపై కూర్చోబెట్టిందో గుర్తు చేశారు.
ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మే 7-10 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.

భారత సైన్యం ధ్వంసం చేసిన వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications