యూపీలో చక్రం తిప్పిన యోగి... 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. 8 సీట్లు గెలుచుకున్నట్లు ముందే ప్రకటించారు. 9వ అభ్యర్ధిగా బీఎస్పీ నుంచి తలపడిన భీమ్‌రావ్ అంబేద్కర్ గెలుస్తారని అంతా ఆశించారు. అయితే 9వ సీటును కూడా బిజెపి గెలుచుకుంది.
9వ సీటుకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యూహంతో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఎస్పీ అభ్యర్ధికి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆశించారు కానీ అలా జరగలేదు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ నియోజకవర్గాల్లో సమాజ్‌వాది పార్టీ గెలుపు విషయంలో బీఎస్పీయే మద్దతిచ్చింది. ఇందుకు బదులుగా రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ మద్దతు లభిస్తుందని మాయావతి ఆశించారు.
కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా ఆమె ఆశ నిరాశే అయింది. దీంతో తమ పార్టీ అభ్యర్ధి పరాజయంపై బీఎస్పీ విచారం వ్యక్తం చేసింది. మరోవైపు సమాజ్‌వాదీ తరుపున రాజ్యసభకు పోటీ చేసిన జయా బచ్చన్ రెండోసారి గెలిచారు.
9 మంది బీజేపీ అభ్యర్థుల గెలుపు అనంతరం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలికిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాల వారీగా ఎన్నికల ఫలితాలు...
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications