కర్ణాటక 'ఓటుకు నోటు': అజ్ఞాతంలో 14 మంది ఎమ్మెల్యేలు
ముంబై: స్టింగ్ ఆపరేషన్ వెలుగు చూసిన నేపథ్యంలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 'రూ. 10 కోట్లు లంచంగా ఇస్తే క్రాస్ ఓటింగ్ చేస్తామంటూ' స్టింగ్ ఆపరేషన్‌లో 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ 14 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ కాంగ్రెస్ అజ్ఞాతంలోకి పంపించింది. వీరంతా కమ్యూనికేషన్‌కు దూరంగా ముంబైలోని ఓ హోటల్‌లో ఉంచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కర్ణాటకలో ఈ స్టింగ్ ఆపరేషన్ వెలుగు చూసిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్ష జేడీఎస్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే కర్ణాటకలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లోగల కేంద్ర ఎన్నికల సంఘాన్ని దిగ్విజయం సింగ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టింగ్ ఆపరేషన్ వీడియోల్లో ఎలాంటి ఆధారాలు లేవని, ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరమేలేదని అన్నారు.
అంతేకాదు స్టింగ్ ఆపరేషన్‌లో దొరిపోయి ఎమ్మెల్యేలను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ వెనకేసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గానీ, ప్రతిపక్షంలో జేడీఎస్‌కు గానీ ఒక్కసీటు గెలుచుకోవడంలో ఈ 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కీలకంగా మారారు.
225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. జేడీఎస్‌కు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకుంటుంది.
మూడో స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అదే జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకోవాలంటే ఐదుగరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో ముంచెత్తారు. ఈ బేరసారాలకు సంబంధించిన వీడియో జూన్ 3వ తేదీన స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడింది.












Click it and Unblock the Notifications