కొత్తగా 15 మంది ఎంపీల ప్రమాణం - తొలిరోజు రివర్స్‌లో రాజసభ - ప్రొడక్టివిటీ పెరిగిందన్న వెంకయ్య

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే పెద్దల సభలో కొత్తగా లేదా తిరిగి ఎన్నికైన 15 మంది ఎంపీలు ప్రమాణాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు చందిన ఆ ఎంపీల చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణాలు చేయించారు. లోక సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ ప్రారంభంకాగా... ముందుగా దివంగత నేతలకు నివాళులు అర్పించారు. వాయిదా అనంతరం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 2014(కేంద్రంలో మోదీ సర్కార్ ఎన్నికైన) తర్వాత నుంచి పార్లమెంట్ నడుస్తోన్న తీరులో మంచి మార్పులు వచ్చాయని, 2014 కంటే పాతికేళ్ల ముందుతో పోల్చుకుంటే ప్రస్తుం పార్లమెంట్ ప్రొడక్టివిటీ బాగా పెరిగిందని అన్నారు. కొత్త‌గా ప్రమాణాలు చేసిన స‌భ్యుల‌ను చైర్మన్ అభినందించారు.

Rajya Sabha: Productivity increased since 2014, says Venkaiah Naidu, 15 new MPs take oath

రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణాలు చేసినవారిలో అజిత్ కుమార్ భూయాన్(ఇండిపెండెంట్), ఫులో దేవి నేతం(కాంగ్రెస్), శిబు సోరెన్(జేఎంఎం) ఎం.వి.శ్రయమ్స్ కుమార్(ఎల్జేడీ) ఫౌజియా ఖాన్(ఎన్సీపీ), వాన్వీరోయ్ ఖార్లుఖి(ఎన్పీపీ), ఎన్ఆర్ ఎలాంగో (డిఎంకె), సెల్వరాసు (డిఎంకె), టి.శివ (డిఎంకె), కె.కేశవ రావు, (టిఆర్‌ఎస్); కె.ఆర్.సురేష్ రెడ్డి (టిఆర్ఎస్); సయ్యద్ జాఫర్ ఇస్లాం (బిజెపి); జై ప్రకాష్ నిషాద్ (బిజెపి), అర్పితా ఘోష్, (టిఎంసి), దినేష్ త్రివేది (టిఎంసి) ఉన్నారు. కాగా,

Recommended Video

    షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu

    వర్షాకాల భేటీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకురాజ్యసభ జరుగుతుందని, శానిటైజేషన్ చేపట్టిన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు లోక్ సభ సమావేశం కావాల్సి ఉంది. అయితే తొలిరోజైన సోమవారం మాత్రం రివర్స్ లో.. ముందు లోక్ సభ, ఆ తర్వాత రాజ్యసభ కొలువుదీరడం కొలువుదీరాయి. కాగా, మంగళవారం నుంచి మాత్రం ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ జరగనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+