మోడీని రప్పించలేను-అర్ధం చేసుకోండి ప్లీజ్-రాజ్యసభ ఛైర్మన్ నిస్సహాయత..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనలు మిన్నంటుతున్నాయి. మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోవడాన్ని నిరసిస్తూ విపక్షాలు నిత్యం ఉభయసభల్లో ఆందోళనకు దిగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం దీనిపై సమగ్ర చర్చకు సిద్ధం కావడం లేదు. కేవలం స్వల్పకాలిక చర్చకు అంగీకరించిన కేంద్రం.. ప్రధాని మోడీ కాకుండా హోంమంత్రి అమిత్ షాతో ప్రకటన చేయిస్తామంటోంది. దీనికి విపక్షాలు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇదే అంశంపై లోక్ సభలో విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. దీనిపై ఈ నెల 8,9,10 తేదీల్లో చర్చకు లోక్ సభ స్పీకర్ అంగీకరించారు. ఇందులో ప్రధాని ప్రకటన ఉండబోతోంది. అయితే అప్పటివరకూ ఆగకుండా ఇప్పుడే ప్రధానిని రాజ్యసభకు రప్పించి ప్రకటన చేయించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం అంగీకరించడం లేదు. అదే సమయంలో ప్రధానిని రాజ్యసభకు రప్పించాలన్న అంశంపై రాజ్యసభ ఛైర్మన్ కూడా తన నిస్సహాయత వ్యక్తం చేశారు.

rajyasabhachairmanjagdeepdhankar

మణిపూర్ పై ప్రకటన కోసం ప్రధాని మోడీని రాజ్యసభకు రప్పించాలన్న విపక్షాల డిమాండ్ పై స్పందించిన ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కడ్ ఇవాళ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని రాజ్యసభకు రప్పించలేనన్నారు. మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రసంగించాలని ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్‌ను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నప్పటికీ, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్.. ప్రధాని మోదీని సభలో ఉండమని ఆదేశించలేరని చెప్పుకొచ్చారు. అలా చెప్పలేమన్నారు. ఇతర ఎంపీల మాదిరిగానే సభకు రావడానికి ప్రత్యేక హక్కు ఆయనకు ఉందన్నారు. దీంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

మణిపూర్‌లో జరిగిన హింస, అశాంతిపై రాజ్యసభ ఛైర్మన్ అంగీకారంతో చర్చకు అనుమతించే రూల్ 267 ప్రకారం తనకు 58 నోటీసులు అందాయని చైర్మన్ ధన్ కడ్ చెప్పారు. జులై 20న రూల్ 167 కింద స్వల్పకాలిక చర్చకు తాను ఇప్పటికే అంగీకరించినందున ఈ నోటీసులను ఆమోదించడం లేదని ఆయన అన్నారు.రూల్ 167 కింద చర్చ రెండున్నర గంటలకే పరిమితం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+