క్రేజీ అవతార్ ఫోటో: రాఖీ‌సావంత్ జిమ్మిక్స్, కమల్ ప్రతిజ్ఞ

ముంబై: రానున్న సార్వత్రిక ఎన్నికలలో వాయువ్య ముంబై నుండి పోటీ చేసి, గెలుపొందాలని ఉవ్వీళ్లూరుతున్న బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ప్రజలను, ఓటర్లను ఆకట్టుకునేందుకు జిమ్మిక్కులు చేస్తోంది. ఆమె పబ్లిసిటీ జిమ్మిక్స్ ఫన్నీగా ఉన్నాయి.

గుడిపాడ్వ సందర్భంగా ఆమె విచిత్ర వేషధారణతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ పర్వదినం రోజున రాశీ సావంత్ తన చేతిలో 'గుడి'ని పట్టుకొని తన పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

Rakhi Sawant Tries To Woo The Public In A Crazy Avatar

పబ్లిసిటీ కోసం రాఖీ సావంత్ గతంలోను ఎన్నో చేశారు. అయితే, ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పి, పార్టీని పెట్టాక కూడా ఆమె పబ్లిసిటీ జిమ్మిక్స్ చేస్తున్నారు.

రాఖీ సావంత్ హఠాత్తుగా రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, పార్టీ పెడుతున్నానని శనివారం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ పేరును ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గరగా... రాష్టీరయ ఆమ్ పార్టీ అని పెట్టారు.

రాఖీ సావంత్ పార్టీ గుర్తు మిరపకాయ. అభివృద్ధిని పట్టించుకోకుండా నిద్రపోతున్న ప్రజాప్రతినిధుల మత్తు పోగొట్టేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని రాఖీ చెబుతున్నారు. రాజకీయ నాయకులు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని చెబుతున్నారు.

కాగా, రాజకీయ ఆరంగేట్రం చేసిన రాఖీ సావంత్ పైన కమల్ రషీద్ ఖాన్ ఆశ్చర్యకరమైన ట్వీట్ చేశారు. వాయువ్య ముంబై నుండి పోటీ చేస్తున్న రాఖీ సావంత్‌కు ఎన్నికల్లో వెయ్యికి పైగా ఓట్లు పడితే తాను భారత్‌ను విడిచి వెళ్లిపోతానని ప్రతిజ్ఞ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+