అయోధ్య రాముడి వైరల్ ఫొటోలు నిజం కాదా ? ప్రధాన అర్చకుడి సంచలన వ్యాఖ్యలు..!
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. రామాలయంలో రామ్ లల్లా విగ్రహాలు ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అయోధ్యలో ప్రతిష్టించే రాముడి విగ్రహం ఇదే నంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోల్ని చూసి భక్తులు కూడా తరిస్తున్నారు. ఈ సమయంలో అయోధ్య ట్రస్టు ప్రధాన అర్చకుడు బాంబు పేల్చారు.
అయోధ్యలో రాముడి విగ్రహం పేరుతో వైరల్ అవుతున్న ఫొటోలు నిజం కాదంటూ శ్రీ రామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తికాకముందే రాముడి విగ్రహం కళ్లు బయట పడలేవన్నారు. రాముడి కళ్లు కనిపించే విగ్రహం అసలు విగ్రహం కాదన్నారు. కళ్లు కనిపిస్తే ఆ కళ్లు ఎవరు బయటపెట్టారనే దానిపై విచారణ జరగాలన్నారు. అసలు ఈ విగ్రహం ఫొటోలు ఎలా వైరల్ అవుతున్నాయని దాస్ ప్రశ్నించారు.

Recommended Video

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫొటోలు వైరల్ అవుతుండటంతో పలువురు వీఐపీలు సైతం వీటిని షేర్ చేశారు. అయితే విశ్వహిందూ పరిషత్ తో పాటు అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు కూడా ఈ చిత్రాల లీక్ ను ఖండించారు. ఇలా లీక్ అయిన ఓ ఫొటోలో .. కర్నాటక నుండి తెచ్చిన నల్లరాతితో చెక్కిన విగ్రహం కళ్ళు కప్పబడి ఉంది. మరొకదానిలో విగ్రహం ముఖం కప్పబడి ఉంది. దీంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది. అయితే విగ్రహాన్ని ఆలయంలో ఉంచడానికి కొన్ని రోజుల ముందు తీసిన చిత్రాలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయని వీహెచ్పీ అధికారులు చెబుతున్నారు. పూర్తి విగ్రహం తొలి చిత్రాలు జనవరి 22న మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications