తీవ్రవాదుల నుంచి బెదిరింపు: బీజేపీ రామ్ మాధవ్‌కు వీఐపీ సెక్యురిటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పార్టీ త్రిపుర విభాగం ఇన్‌ఛార్జి సునీల్ దేవోదార్‌లకు కేంద్ర సాయుధ బలగాలు వీఐపీ భద్రత కల్పిస్తున్నాయి.
తీవ్రవాదుల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్‌కు వై ప్లస్ (Y+ భద్రత), దేవోదార్‌కు ఎక్స్ కేటగిరీ (X category) భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.

వీరిద్దరు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో నిత్యం సంరక్షిస్తూ ఉండాలని సీఆర్పీఎఫ్‌కు ఆదేశాలు జారీ చేశారు. రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జిగా కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications