ఈ నెల 27న అయోధ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్?

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో పలు సంస్కరణలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఆయన అయోధ్యలో పర్యటించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

yogi adityanath

ఇప్పటికే ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నాలుగు ప్రదేశాలను సందర్శిస్తారని సమాచారం. అందులో రామ జన్మభూమి, హనుమాన్‌ గర్హి, కనక భవన్‌ ఉన్నాయి. తన పాత స్నేహితుడు హరిధామ్‌ పీఠానికి చెందిన రామ్‌ దినేశాచార్యను యోగి కలవనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The visit will take place a few days after Supreme Court suggested contesting parties in the Ram Mandir dispute to reach an amicable solution through dialogue.
Please Wait while comments are loading...