రామ మందిరం వివాదం: శ్రీశ్రీ రవిశంకర్ గురూజీతో షియా వక్స్ బోర్డు చైర్మన్ భేటీ, చర్చలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయం గురించి చర్చించడానికి ఆ రాష్ట్ర షియా వక్స్ బోర్డు చైర్మన్ వాసీమ్ రిజ్వీ బెంగళూరు నగర శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం చేరుకుని శ్రీశ్రీ రవిశంకర్ గురూజీతో భేటీ అయ్యారు. మంగళవారం వాసీమ్ రిజ్వీ, శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ చర్చలు జరిపారు.

చర్చల అనంతరం వాసీమ్ రిజ్వీ మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం శ్రీశ్రీ రవిశంకర్ గురూజీని గౌరవిస్తుందని అన్నారు. రామ మందిరం నిర్మాణం సమస్యను శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ త్వరలోనే పరిష్కరిస్తారనే నమ్మకం తమకు ఉందని వాసీమ్ రిజ్వీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Ram Temple issue Shia Waqf Board Chief Wasim Rizvi met Sri Sri Ravi Shankar in Bengaluru

రామ మందిరం నిర్మాణం విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉన్నాయో వారితో శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ చర్చలు జరపాలని తాము ఆయనకు మనవి చేశామని వాసీమ్ రిజ్వీ అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో ఎదురైన సమస్యలు పరిష్కరించడానికి శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ సిద్దం అయ్యారు.

Ram Temple issue Shia Waqf Board Chief Wasim Rizvi met Sri Sri Ravi Shankar in Bengaluru

అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో ఎదురైన సమస్యను పరిష్కరించడానికి, చర్చలు జరపడానికి శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ సరైన మధ్యవర్తి కాదని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకుడు మాట్లాడిన మరుసటి రోజే బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేరుకున్న వాసీమ్ రిజ్వీ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీతో చర్చలు జరపడం కొసమెరుపు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ram Temple issue: Uttar Pradesh Shia Waqf Board Chief Wasim Rizvi met Sri Sri Ravi Shankar in Art Of Living Ashram, Bengaluru

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి