కర్ణాటక మాజీమంత్రి రాసలీల కేసులో షాకింగ్ ట్విస్ట్. తెరపైకొచ్చిన సీడీ గర్ల్ తండ్రి: కిడ్నాప్

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీమంత్రి రమేష్ జార్కిహోళి రాసలీల కేసు.. అనూహ్య మలుపును తీసుకుంది. కొత్తగా ఈ ఉదంతంలో బాధితురాలి తండ్రి తెర మీదకి వచ్చారు. సెక్స్ స్కాండల్ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె కుటుంబం కొద్దిరోజుల పాటు బాహ్యప్రపంచానికి దూరంగా గడిపింది. తాజాగా- వార్తల్లోకెక్కింది. కిడ్నాప్ కేసుతో ఆ కుటుంబం వెలుగులోకి వచ్చింది. రమేష్ జార్కిహోళి సీడీ వ్యవహారంపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ కేసును బదలాయించే అవకాశం ఉంది.

బెళగావిలో కేసు నమోదు..

బెళగావిలో కేసు నమోదు..

కొద్దిరోజులుగా తన కుమార్తె కనిపించట్లేదంటూ బాధిత యువతి తండ్రి ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు ఆర్టీ నగరలో ఓ పేయిగ్ గెస్ట్ హాస్టల్‌లో నివసించే తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెళగావిలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసును నమోదు చేశారు. 363, 368, 343, 346, 354, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీన్ని సిట్‌కు బదలాయిస్తారని తెలుస్తోంది.

ఫిర్యాదులో ఏముందంటే..?

ఫిర్యాదులో ఏముందంటే..?

తన కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ, ఆర్టీ నగరలోని ఓ పీజీలో నివాసం ఉంటున్నారని ప్రకాష్.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ఆమె ఇంటికి వస్తుంటారని, కొద్దిరోజులుగా ఆమె బెళగావికి రావట్లేదని అన్నారు. ఇటీవలే టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అశ్లీల వీడియోలో కనిపించిన యువతి తన కుమార్తె అనే విషయం ప్రచారంలో ఉందని చెప్పారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత.. ఆమె తనతో ఫోనులో మాట్లాడారని, అందులో ఉన్నది తాను కాదని వివరించినట్లు ప్రకాష్ పేర్కొన్నారు.

ఫోన్ స్విచాఫ్..

ఫోన్ స్విచాఫ్..

ఏడెనిమిది రోజులుగా తన కుమార్తె ఫోన్ స్విచాఫ్‌లో ఉందని, ఆమె ఎక్కడ ఉందనేది తెలియరావట్లేదని సీడీ యువతి తండ్రి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని అన్నారు. వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత తనకు ప్రాణభయం ఉందని తమతో చెప్పారని, అదే సమయంలో ఆమె జాడ తెలియకుండా పోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయని ప్రకాష్ చెప్పారు. తన కుమార్తె ఎక్కడ ఉన్నారనేది తెలియట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు ప్రాణభయం ఉందని, వెంటనే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీఎంసీ పోలీసులు కిడ్నాప్ కేసును నమోదు చేశారు.

 సీడీ వెలుగులోకి వచ్చిన తరువాత అదృశ్యం..

సీడీ వెలుగులోకి వచ్చిన తరువాత అదృశ్యం..

కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి రాజీనామాకు దారితీసిన ఈ రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత.. ఆయనతో పాటు సీడీలో కనిపించిన ఆ యువతి అదృశ్యం అయ్యారు. ఆమె ఎక్కడ ఉన్నారనేది తెలియరావట్లేదు. సీడీ వెలుగులోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా ఆమె జాడ తెలియ రాలేదు. అదే సమయంలో ఆ యువతి తండ్రి.. కిడ్నాప్ కేసుతో వార్తల్లోకి ఎక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ఉద్దేశపూరకంగా అజ్ఙాతంలోకి వెళ్లారా? లేక ఆమె తండ్రి అనుమానిస్తోన్న మేరకు కిడ్నాప్‌కు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+