నిరాహార దీక్ష: మహిళ నాయకురాలి మృతి
ఉత్తరప్రదేశ్: తమ డిమాండ్ లు తీర్చాలని నిరాహారదీక్ష చేస్తున్న కార్మిక సంఘం మహిళ నాయకురాలు మరణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మహోలీలో నీరాహార దీక్ష చేస్తున్న అనేక మంది మహిళల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహోలీలో 17 సంవత్సరాల నుండి సుగర్ మిల్ మూతపడింది. ఈ మిల్ తెరిపించాలని చాల కాలం నుండి ఆందోళన చేస్తున్నారు. మిల్ దగ్గర సుమారు 30 మంది మహిళ కార్మికులు నిరాహారదీక్ష చేస్తున్నారు. స్థానిక కార్మిక సంఘాల నాయకులు వీరికి మద్దతు ఇస్తున్నారు.

ఇదే చోట కార్మిక సంఘం మహిళ నాయకురాలు రామ్ రాఠి (40) నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడం, వేడిగాలు తీవ్రత ఎక్కువ కావడంతో రామ్ రాఠి ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స విఫలమై రామ్ రాఠి మరణించారని వైద్యులు వెల్లడించారు. డీ హైడ్రేషన్ కారణంగా రామ్ రాఠి మరణించారని వైద్యులు దృవీకరించారు. ఎండలు ఎక్కువ అయ్యాయని, వేడిగాలుల తీవ్రత ఎక్కువ అయ్యిందని వెంటనే నిరాహార దీక్షను విరమించాలని మనవి చేసినా పట్టించుకోని కార్మికుల మీద కేసులు నమోదు చేశామని మహోలీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications