కరోనా కథ మొదటికొచ్చింది- విమానాశ్రయాల్లో కోవిడ్ శాంపిళ్లు పునఃప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పురుడు పోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. తీవ్రత భారత్‌పై పడినట్టే కనిపిస్తోంది. చైనాలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతోండంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. జపాన్, దక్షిణ కొరియాతో పాటు అమెరికా, బ్రెజిల్‌లల్లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌‌లోనూ ఈ మహమ్మారి ఉధృతి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి.

అత్యవసర సమీక్ష..

అత్యవసర సమీక్ష..

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ ఇవ్వాళ సమీక్ష చేపట్టారు. ఈ ఉదయం 11:30 గంటలకు దేశ రాజధానిలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం ఈ సమీక్ష ఆరంభమైంది. ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఆయుష్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ అరోరా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇంకా పూర్తిగా తొలగిపోలేదు..

ఇంకా పూర్తిగా తొలగిపోలేదు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ సర్వైలెన్స్‌ వ్యవస్థను పటిష్ట పర్చాలని సమీక్షా సమావేశంలో ఆదేశించినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు.

మాస్కులు తప్పనిసరి..

మాస్కులు తప్పనిసరి..

ఈ సమావేశం ముగిసిన అనంతరం డాక్టర్ వీకే పాల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని సూచించారు. గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్, ఔట్ డోర్స్‌లల్లో మాస్కులను ధరించాలని చెప్పారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారు, వయోధిక వృద్ధులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు.

సీనియర్ సిటిజన్లు..

సీనియర్ సిటిజన్లు..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 27 నుంచి 28 శాతం మంది మాత్రమే ప్రికాషన్ డోస్ తీసుకున్నారని వీకే పాల్ చెప్పారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ డోస్‌ను తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. మిగిలిన వారు కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు. ప్రికాషన్ డోస్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్టుల్లో శాంపిల్స్..

ఎయిర్‌పోర్టుల్లో శాంపిల్స్..

తాజాగా- విమానాశ్రయాల్లో కరోనా వైరస శాంపిళ్లు తీసుకోవడాన్ని పునఃప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లోనూ దీన్ని అప్పటికప్పుడు వైద్య సిబ్బందిని మోహరింపజేసింది. శాంపిళ్లను సేకరించే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం విదేశీ ప్రయాణికుల నుంచి మాత్రమే ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరిస్తోన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ తీవత్ర ఆధారంగా దీన్ని విస్తరిస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+