అత్యాచారం చేశాడు, రూ.5 లక్షల కట్నం అడిగాడు
ఓ యువతిపై అత్యాచారం చేసిన యువకుడు, ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూ.5 లక్షల కట్నం అడిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
లక్నో: ఓ యువతిపై అత్యాచారం చేసిన యువకుడు, ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూ.5 లక్షల కట్నం అడిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
బండా గ్రామానికి చెందిన తాజ్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

వారు నిందితుడిని పిలిపించి కేసులు పెట్టమని, అయితే యువతిని పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేశారు. పెళ్లి చేసుకునేందుకు తాజ్ అంగీకరించాడు. కానీ పెళ్లి తేదీ దగ్గరపడుతున్న సమయంలో రూ.5 లక్షలు కట్నం కావాలని అన్నాడు.
అందుకు బాధితురాలి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో తాజ్ పెళ్లి ఆపేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాజ్‌పై కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications