మరదలిపై రేప్‌యత్నం, భర్తతో చెప్తాననగా ఇద్దరి హత్య
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. 35 ఏళ్ల ఓ వ్యక్తి తన తమ్ముడి భార్య పైన అత్యాచారయత్నం చేశాడు. దానిని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె పదేళ్ల తనయుడిని కూడా చంపాడు.
ఈ దారుణ సంఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో జరిగింది. నిందితుడిని పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ ఘటన పైన అతను విరుద్ధమైన విషయాలు చెప్పడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇంకా కేసు గురించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు, అతని సోదరుడు ఓ డెయిరీని నడుపుతున్నారు. వారిద్దరు ఇద్దరు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. ఆ రెండు కుటుంబాలు కూడా డబుల్ అంతస్తుల భవంతిలో నివసిస్తున్నాయి. నిందితుడు తరుచూ తన భార్యతో గొడవ పడే వాడు. ఆమె వెళ్లి పోయినప్పుడు ఇతను తన సోదరుడి భార్యను వేధింపులకు గురి చేసేవాడు.

మృతి
మంగళవారం రాత్రి మృతి చెందిన మహిళ భర్త టెర్రాస్ పైన నిద్రించేందుకు వెళ్లాడు. అతను ఉదయం నాలుగున్నర గంటలకు వచ్చాడు. అతను ఇంట్లో ఉన్న భార్యను నిద్రలేపే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఎంతకూ లేవలేదు. తండ్రి గొంతు విని ఓ కొడుకు నిద్రలేచాడు. మరో కొడుకు మాత్రం మృతి చెంది ఉన్నాడు.

మృతి
దీంతో ఆ భర్త చుట్టు పక్కల వారి కోసం కేకలు వేశాడు. స్థానికుల సహాయంతో తన భార్యను, కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కానీ వారు మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు. ఆమ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

మృతి
మృతుల పైన ఫింగర్ ఫ్రింట్స్‌ను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. వారు హత్యకు గురైనట్లుగా రిపోర్ట్ ద్వారా తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటిలోకి ఎవరు వచ్చిన ఛాయలు లేనందున బయటి వారు హత్య చేసేందుకు ఆస్కారం లేదని పోలీసులు గుర్తించారు.

మృతి
పోలీసులు కుటుంబ సభ్యులు అందర్నీ విచారించారు. మృతురాలి భర్త సోదరుడు విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తాను ఎక్కడున్నాననే విషయంలో పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశాడు.

మృతి
అదే సమయంలో తన చేతి పైన గాట్లు ఎందుకు పడ్డాయో చెప్పలేకపోయాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అతను తన తప్పును అంగీకరించాడు.

మృతి
తాను రాత్రి ఆమె ఉంటున్న గదిలోకి వెళ్లానని, ఆమెను బలవంతం చేశాని, అయితే తాను బలవంతం చేసిన విషయాన్ని భర్తతో చెబుతానంటే గొంతు కోసానని అతను పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. వారి మధ్య జరుగుతున్న అలికిడితో ఆమె కొడుకు ఒకరు లేచారు. దీంతో అతనిని కూడా ఆ సోదరుడి భర్త చంపాడు. మరో బాలుడు నిద్రలోనే ఉండటంతో అతనిని వదిలేశాడు. ఆ తర్వాత సంఘటన స్థలంలో అంతా శుభ్రం చేశాడు. ఇతని పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications