చిన్నారిపై అత్యాచారం, హత్య, తల్లిని చంపిన టెక్కీ: కోర్టులో దుమ్ములేపిన మహిళలు!

చెన్నై: చిన్నారి మీద అత్యాచారం చేసి హత్య చేసి జైలుకు వెళ్లి జామీను మీద బయటకు వచ్చి సొంత తల్లిని దారుణంగా హత్య చేసిన చెన్నై సాఫ్ట్ వేర్ ఇంజనీరు దశ్వంత్ ను బుధవారం పలువురు మహిళలు కోర్టు ఆవరణంలోనే చితకబాదాశారు.

దశ్వంత్ లాంటి నీచుడు ఇలాంటి సమాజంలో బ్రతకడానికి అవకాశం ఇవ్వకూడాదని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. హాసిని (6) అనే చిన్నారి మీద అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు దశ్వంత్ (23ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Rape, murder accused techie attacked in court premises by woman in Chennai

తరువాత జామీను మీద బయటకు వచ్చిన దశ్వంత్ విలాసవంతమైన జీవితం గడపడానికి, బెట్టింగ్ లు కట్టడానికి ప్రతి రోజు మూడు వేల రూపాయలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధించాడు. డబ్బులు ఇవ్వడానికి దశ్వంత్ తల్లి నిరాకరించారు.

డిసెంబర్ 2వ తేదీ ఇంటిలో సొంత తల్లిని దారుణంగా హత్య చేసిన దశ్వంత్ ఆమె శరీరం మీద ఉన్న నగలు, బీరువాలోని బంగారు నగలు లూటీ చేసి ముంబై పారిపోయాడు. దశ్వంత్ అతని తల్లిని హత్య చేశాడని గుర్తించిన పోలీసులు ముంబై వెళ్లి అతన్ని అరెస్టు చేసి చెన్నైకి తీసుకు వచ్చారు.

బుధవారం చెన్నై నగరం సమీపంలోని చెంగల్పట్టు కోర్టులో నిందితుడు దశ్వంత్ ను హాజరుపరచడానికి పోలీసులు గట్టి బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వందల మంది మహిళలు ఒక్క సారిగా దశ్వంత్ ను చట్టుముట్టి చాతకబాదేశారు.

దశ్వంత్ ను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. చివరికి మహిళల దాడి నుంచి దశ్వంత్ ను రక్షించిన పోలీసులు అతన్ని కోర్టు లోపలికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో ఇలాంటి నీచుడు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఇవ్వకూడదని, కేసు విచారణ త్వరగా పూర్తి చెయ్యాలని మహిళలు కోర్టులో మనవి చేశారు. దశ్వంత్ కేసు విచారణ చేస్తున్న అతని న్యాయవాది బుధవారం విచారణ నుంచి తప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+