రేప్ కేసు: నారాయణ్ సాయికి ఓ చిన్నారి
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి ఆచూకీని గుజరాత్ పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచీ నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. అయితే పోలీసులు జరిపిన తమ విచారణలో మరో వివాదాస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది.
నారాయణ్ సాయికి అమ్మాయిలను సరఫరా చేసిందనే ఆరోపణలతో పోలీసులు అతని సహాయకురాలు గంగను అరెస్ట్ చేశారు. కాగా నారాయణ్ సాయి.. గంగతో శారీరక సంబంధం ఏర్పర్చుకోవడంతో వారికి ఓ చిన్నారి జన్మించినట్లు గుజరాత్ పోలీసులు తమ విచారణలో తేల్చారు. స్థానిక కోర్టు నిందితుడైన నారాయణ్ సాయి పరారీలో ఉన్నట్లు ప్రకటించింది.

నిందితుడు నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడని ప్రకటించిన నాటి నుంచి 30రోజుల్లోగా కోర్టు ముందుగానీ, విచారణాధికారి ముందుగానీ హాజరుకావాలని నారాయణ్ సాయిని కోర్టు ఆదేశించింది. ఆశారాం బాపు, అతని కుమారుడు నారాయణ్ సాయి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సూరత్‌కు చెందిన సోదరీమణులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నారాయణ్ సాయి కోసం గాలిస్తున్నారు. సుమారు నెలరోజుల నుంచి నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు.
నారాయణ్ సాయి కోర్టు విధించిన 30 రోజుల్లోగా హాజరు కానట్లయితే సిఆర్‌పిసి 83 సెక్షన్ ప్రకారం అతని వ్యక్తిగత ఆస్తులను సీజ్ చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ప్రస్తుతం ఆశారాం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు పాల్పడిన కేసులో ఆశారాంను ఇండోర్ ఆశ్రమం నుంచి ఆగస్టు 15న రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications