వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ లాగే నన్నూ రేప్ చేస్తామని బెదిరించారు : ప్రియాంక

|
Google Oneindia TeluguNews

ముంబై: ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళా భద్రతా ప్రశ్నార్థకంలో పడిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది. మహిళా రక్షణ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ప్రియాంక.

భౌతికంగానే గాక, సోషల్ మీడియాలోను మహిళల పట్ల వేధింపులు పెరిగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటివరకు సరైన చట్టాలేవి లేకపోవడం శోచనీయమన్నారు. సామాజిక మాధ్యమాల ముసుగులో మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపుల గురించి వ్యాసం రాసిన ప్రియంకా చతుర్వేది ఈ విషయాలను అందులో ప్రస్తావించారు.

సోషల్ మీడియా వేధింపులపై స్పందిస్తూ.. తాను కూడా సోషల్ మీడియా బాధితురాలినేనని ప్రియంక తెలిపారు. కొంతమంది వ్యక్తులు ట్విట్టర్ ద్వారా తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్న ప్రియాంక, నిర్భయ రేప్ మాదిరిగానే తనను కూడా రేప్ చేసి హతమారుస్తామని వారు హెచ్చరించినట్టుగా తెలియజేశారు.

 'Rape Threat' To Priyanka Chaturvedi Sparks Debate On Social Media Abuses

రాజకీయంగా ప్రముఖ నాయకురాలిగా ఉన్న తనకే ఇలాంటి బెదిరింపులు తప్పకపోతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఇంకెంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, హక్కు తనకు ఉన్నాయని, అందుకే మహిళా సమస్యలపై స్పందిస్తున్నానని అన్నారు.

కొన్ని హిందూ సంస్థలతో కలిసి పనిచేస్తున్నవారు, వాటి మద్దతుదారులు కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డారని, అయితే ఆ హెచ్చరికలను తానెప్పుడూ ఖాతరు చేయలేదని చెప్పారు. తనపై బెదిరింపులకు సంబంధించి విషయం గురించి సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రస్తావిస్తానని, ఒకవేళ నిందితులు బెయిల్ మీద బయటకొచ్చినా.. న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటానికి దిగుతునాని స్పష్టం చేశారు.

తనపై బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు సహకరించిన ముంబై పోలీసులకు కృతజ్ఞతలుతెలియజేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు కొత్తేమి కాదని, పోలీసులను సంప్రదించడం కూడా ఇదేమి మొదటిసారి కాదన్న విషయాన్ని నిందితులకు గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి పదవిలో ఉండి మహిళలపై సైబర్ వేధింపులను నివారించడం సాధ్యం కాదని అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. బీజేపీ నేతలు నోటికి పని చెప్పడం మానుకుని మహిళల రక్షణ కోసం కృషి చేయాలని హితవు పలికారు. సోషల్ మీడియా వేదికగా మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులను ఖచ్చితంగా అడ్డుకోవాలని, ఇందుకోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలని సూచించారు.

English summary
The abusive threat was a reminder of the chilling 2012 gang-rape and murder of a medical student in Delhi which had sparked a nationwide debate on women safety. It evoked bitter reactions on Twitter and the account was blocked. Ms Chaturvedi also filed a police case against the user.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X