దారుణం: నడిరోడ్డుపై రేప్ బాధితుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు అత్యాచార బాధితులు ఆదివారం పట్ట పగలే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో మరో రెండు రోజుల్లో కోర్టుకు సాక్షిగా హాజరుకావాల్సిన ఓ యువతి కూడా ఉంది. మౌ జిల్లాలోని బైజాపూర్ గ్రామంలో 18 ఏళ్ల అత్యాచార బాధితురాలిని మోటారు బైక్‌పై వెళుతున్న యువకులు కాల్చిచంపారని పోలీసులు తెలిపారు.
మరో రెండు రోజుల్లో కోర్టుకు హాజరు కావాల్సిన ఈ యువతి తన సోదరుడితో కలిసి ఆసుపత్రికి వెళుతున్న సమయంలోనే ఈ దారుణం జరిగిందని, తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. 2011 జూన్ ఆరో తేదీన బికె సింగ్ అనే ఓ కాలేజీ మేనేజర్ ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడి మనుషులే తమ కూతురును హతమార్చారని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నేరస్థులను వదిలేదని లేదని, వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అదనపు ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు.
మరో సంఘటనలో అత్యాచార నిందితుడే 23 సంవత్సరాల బాధితురాలిని కాల్చిచంపాడు. ఇతడిపై గత ఏడాదే బాధితురాలు ఫిర్యాదు దాఖలు చేసిందని పోలీసులు తెలిపారు.తన భర్తతో కలిసి ఆమె సైకిల్‌పై వెళుతుండగా ప్రదీప్ అనే నిందితుడే ఆమెను కాల్చిచంపాడని తెలిపారు.
రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చిన ప్రదీప్ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బాధితురాలిపై వత్తిడి తేవలడం మొదలు పెట్టాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. తాజా సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందంటూ విపక్షాలు అఖిలేష్ యాదవ్ సర్కార్‌పై నిప్పులు చెరిగాయి.












Click it and Unblock the Notifications