వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంకుల్ రేప్: విక్టిమ్‌ చదువుకు రూ. 3 లక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చదువుకోవడానికి అత్యాచార బాధితురాలికి 3 లక్షల రూపాయలు చెల్లించాలని ఢిల్లీ కోర్టు దోషిని ఆదేశించింది. అదే సమయంలో అతనికి శిశు అత్యాచార నిరోధక చట్టం కింద కఠినమైన శిక్ష కూడా విధించింది. ఏడేళ్ల బాలికపై ఆమె అంకుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

నడి వయస్సు వ్యక్తి అక్షయ్ తన మరదలి కూతురిపై నిరుడు ఆగస్టులో అత్యాచారం చేశాడు. అతనికి పదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు నవంబర్ 30వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. బాలిక చదువు కోసం నష్టపరిహారం కింద రెండు లక్షల రూపాయలు కేటాయించాలని కోర్టు ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.

Rapist told to pay Rs 3 lakh to fund minor victim’s education

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - నిరుడు ఆగస్టు 17వతేదీన తాను నిందితుడికి, అతనికి భార్యకు మధ్య ఇంటి పైభాగాన పడుకున్నానని, నొప్పి కలగడంతో లేచానని, అతను వేళ్లను తన ప్రైవేట్ పార్ట్స్‌లో జొప్పించడం గమనించానని బాధితురాలు చెప్పింది.

బాలిక తల్లి, అంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్షయ్‌ని అరెస్టు చేశారు. అయితే, మహిళలిద్దరు ఆ తర్వాత ఎదురు తిరిగి బాలికను అక్షయ్ కొట్టాడని చెప్పారు. అయితే, బాలిక కథనాన్ని నమ్ముతూ కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

English summary
A seven-year-old girl raped by her uncle will receive Rs 3 lakh to fund her education, a Delhi court has ruled while convicting the rapist under the stringent child rape laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X