వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ వ్యాఖ్యలపై దుమారం: వెనక్కి తగ్గని ములాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rapists remark: Mulayam says SP respects women 'the most'
ముంబై: అత్యాచారం కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయడాన్ని తప్పు పడుతూ ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ములాయం సింగ్‌పై కాంగ్రెసు, బిజెపి నాయకులు ధ్వజమెత్తారు. అయినా ములాయం సింగ్ యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి ఇష్టపడడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలపై చర్చ అవసరం లేదని ములాయం సింగ్ అన్నారు. అయితే, తమ పార్టీకి మహిళలపై ఎనలేని గౌరవం ఉందని ఆయన చెప్పారు.

ములాయం సింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని కాంగ్రెసు, బిజెపి డిమాండ్ చేశాయి. ఓ సీనియర్ నేత అటువంటి వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమే కాకుండా విచాకరమూ సిగ్గు చేటు అని కాంగ్రెసు నేత మీం అఫ్జల్ అన్నారు. తన హృదయంలో ములాయం సింగ్‌కు ఎంతపాటి గౌరవం ఉందో వ్యాఖ్యల వల్ల అర్థమవుతోందని అన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ములాయం మార్గదర్శకత్వంలో నడుస్తోందని, అటువంటి స్థితిలో ములాయం వ్యాఖ్యలు కుర్రాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని అఫ్జల్ అన్నారు. ములాయం సింగ్ వ్యాఖ్యలను ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారు. ములాయం సింగ్ పట్టాలు తప్పారని ఆయన అన్నారు. తాను ఏం మాట్లాడుతున్నాననే విషయం కూడా ములాయంకు తెలియడం లేదని ఆయన అన్నారు.

ములాయం సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, ములాయం వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. సున్నితమైన విషయాలతో ములాయం రాజకీయం చేస్తున్నారని, ఆ విధమైన నాయకుల తీరును భారత్ క్షమించదని ఆయన అన్నారు.

ఆ వ్యాఖ్యలపై బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ ప్రతిస్పందిస్తూ - కేంద్రంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని అన్నారు. ములాయం సింగ్ అత్యాచార దోషులను కాపాడడానికి చట్టాన్ని మార్చాలనుకుంటే తనవంటివారు అడ్డుకుంటారని ఆమె అన్నారు.

English summary
Samajwadi Party chief Mulayam Singh Yadav who is under-fire from Opposition, women's activist and the common people for his controversial remarks on 'rapists' said on Friday that there should be no debate on what he has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X