రాష్ డ్రైవింగ్‌కు బలి: బైక్ యువతిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: రాష్ డ్రైవింగ్ ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. ముంబైలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ బైక్ గిరిజ అంబాల అనే 19 ఏళ్ల యువతిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆమె చొక్కా బండి చక్రాల కింద ఇరుక్కుపోయింది.

బైకర్ వాహనాన్ని ఆపలేదు. దాంతో బైక్‌ ఆమెను 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలై ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెస్నేహితుడు కునాల్‌ సురేంద్ర వైద్య(21)తో కలసి వొర్లీ సీ ఫేస్‌కు గిరిజ వెళ్లారు.

Rash Biker Kills Female Teenager After Dragging Her For 100 Metres

రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కునాల్‌తో కలసి రోడ్డు దాటుతున్న ఆమెను ముగ్గురితో అతి వేగంగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గిరిజను బండి ఈడ్చుకెళ్లడంతో ఆమె తల డివైడర్‌కు తాకుతూ పోయింది.

దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆదివారం గిరిజ కన్నుమూశారు. మహిమ్ ప్రాంతంలో గిరిజ నివసిస్తూ కెబిపి హిందూ కాలేజీలో చదువుతోంది.

బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన గిరిజ అవయవాలను దానం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. అయితే, ఎక్కువ రక్తం పోవడం వల్ల ఆమె అవయవాలను తీసుకోలేమని వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A speeding motorcycle took the life of KBP Hinduja college student Girija Ambala, 19, and injured her friend Kunal Surendra Vaidya, 21.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X