రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి: పార్సీ అయినప్పటికీ..

ఆదర్శ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ (NCPA) గ్రౌండ్స్ కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం అక్కడ్నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో వందలాది మంది ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.

వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, రతన్ టాటా పార్సీ మతస్థుడైనప్పటికీ.. ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Ratan Tata s last rites are completed with state honours

కాగా, పార్సీల అంత్యక్రియలు హిందూ, ముస్లింల మాదిరి కాకుండా భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా వారు భావిస్తారు. అందుకే శరీరాన్ని ప్రకృతిక తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషతం అవుతాయని జొరాస్ట్రియన్ల విశ్వాసం. అందుకే వారు ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేస్తారు.

అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్ మేనాశీనిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలనేది వీరి ఆశయం కావడం గమనార్హం.


అయితే, పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ.. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య బాగా తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిని అనుసరించడం వారికి అసాధ్యంగా మారింది. దీంతో సోలార్ లేదా విద్యుత్ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాష్ట్రియన్ నియామాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలు కూడా కూడా ఈ విధానంలో జరిగాయి. రతన్ టాటా అంత్యక్రియల్లో పార్సీలతోపాటు అన్ని మతాల గురువులు ప్రార్థనలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+