రేవ్ పార్టీపై దాడి, 15 మంది యువతులు సహా ఓవర్స్
న్యూఢిల్లీ: గుర్గావ్ పోలీసులు శనివారం రాత్రి ఓ రేవ్ పార్టీ పైన దాడి చేసి 15 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో జరిగిన ఈ పార్టీలో పాలు పంచుకున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో టీనేజ్ యువతులున్నారు.
సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో గుట్టుగా రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హోటల్ పైన దాడి చేశారు. పోలీసులు హోటల్ యజమానులను కూడా అరెస్టు చేశారు. అలాగే, పార్టీని ఏర్పాటు చేసిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పార్టీకి హాజరైన యువకులంతా ఢిల్లీకి చెందిన వారేనని పోలీసులు చెప్పారు. వీరిని ఆదివారం ఉదయం దాకా స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. హోటల్ యజమానులు, నిర్వహాకులపై కేసులు నమోదయ్యాయి.

ఈ దాడిలో తాము పలు నార్కోటిక్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వీటి శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు.
కోబాడ్ కేసులో యూపీ పోలీసులపై వారెంట్
నక్సలైట్ నాయకుడు కోబాడ్‌గాంధీ కేసులో సాక్ష్యమివ్వాల్సిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారుల అరెస్టుకు ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి రీతేశ్ సింగ్ అరెస్ట్ వారంట్లు జారీచేశారు. పోలీసు ఉప సూపరింటెండెంట్లు సమీర్ సౌరభ్, రాజేశ్ శ్రీవాస్తవ, ఎస్‌ఐ రాజీవ్ ద్వివేదిలకు సమన్లు పంపినా హాజరుకాకపోవడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణను నవంబర్ 5కు వాయిదా వేస్తూ- ఆ రోజున హాజరై రూ.5వేలు పూచీకత్తు చెల్లించి బెయిల్ పొందాలని ఆదేశించారు. కాగా, కోబాడ్‌కు మరో కేసులో బెయిలు లభించినా, తాజా అభియోగపత్రం దాఖలు కావడంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications