వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rave Partyలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మందు మగువ మత్తు: పోలీసుల ఎంట్రీ..పరువు పోయే..!

|
Google Oneindia TeluguNews

ముంబై: రేవ్ పార్టీలకు మహానగరాలు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తప్పని తెలిసినా కూడా కొందరు మాత్రం ఏదో ధైర్యంతో ముందుకు అడుగులు వేసి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా సెలబ్రిటీలు లేదా సమాజంలో బడాబాబులుగా చలామణి అవుతున్న వారు కావడం విశేషం. శనివారం వచ్చిందంటే చాలు.. తాగడం తందనాలు ఆడటం, రేవ్ పార్టీల పేరుతో అమ్మాయిలతో కలిసి అసభ్య కార్యకలాపాలు నిర్వహించడం మెట్రో నగరాల్లో ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది.

కరోనా విజృంభిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా యదేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా నాశిక్‌ జిల్లాలో జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కూడా ఉంది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్టు

బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్టు

మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో ఉన్న ఇగత్‌పురి టౌన్‌లో ఓ రెండు విల్లాలో రేవ్‌ పార్టీ జరిగింది. అసలే మత్తు ఆ పై మగువ.. దానికి తోడు డ్రగ్స్. ఇక ఊహించుకోవచ్చు పార్టీ ఏ రేంజ్‌లో జరుగుతోందో. సరిగ్గా ఇదే సమయానికి రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

అప్పటికే అంతా మత్తు పదార్థాలు సేవించి మత్తులో జోగుతున్నారు. పోలీసులు మొత్తం 22 మందిని అరెస్టు చేశారు. వీరిలో 12 మంది అమ్మాయిలున్నారు. ఇందులో ఒకరు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా ఉంది. మరో నలుగురు అమ్మాయిలు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

డ్రగ్స్ కేసు నమోదు

డ్రగ్స్ కేసు నమోదు

శనివారం రాత్రి ప్రారంభమైన పార్టీ ఆదివారం ఉదయం వరకు సాగింది. పాటలు, ఆటలు అమ్మాయిలు, మద్యంతో ఇలా పలువురు ఎంజాయ్ చేస్తున్న సమయంలో పోలీసులకు ఎస్పీ నుంచి వచ్చిన సమాచారం ఆ విల్లాలపై దాడి చేశారు. స్కై తాజ్ మరియు స్కై లగూన్ అనే రెండు విల్లాల్లో ఈ రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. 10 మంది పురుషులను 12 మంది అమ్మాయిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరందరినీ మెడికల్ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. వీరిపై నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్స్‌టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బడాబాబుల హస్తం..నైజీరియన్ అరెస్టు

బడాబాబుల హస్తం..నైజీరియన్ అరెస్టు

ఇక ఈ పార్టీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్లు చెప్పిన పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అయితే ఈ పార్టీకి వచ్చిన వారంతా అతి విలాసవంతమైన కార్లలో వచ్చారని చెప్పిన పోలీసులు దీనివెనక బడాబాబుల హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక ఘటనా స్థలం నుంచి పోలీసులు డ్రగ్స్‌తో పాటు ఓ కెమెరా, ట్రైపాడ్ ఇతరత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

రేవ్ పార్టీపై దాడులు జరిగిన తర్వాత ఓ పోలీసు బృందాన్ని ముంబైకి పంపి ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ నైజీరియా దేశస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలం ముంబై ఆగ్రా జాతీయ రహదారిపై ఉంది. అంటే ముంబై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు.

English summary
Nashik Police busted a rave party that was organised in two villas and arrested 22 people where a female former bigg boss contestant was also involved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X