'అగస్టా నుంచి దృష్టి మరల్చేందుకే మోడీపై రాహుల్ గాంధీ సంచలనం'
ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర ఆరోపణలు చేసిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర ఆరోపణలు చేసిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ బుధవారం నాడు నిప్పులు చెరిగారు. అగస్టా నుంచి దృష్టి మరల్చేందుకు మోడీని టార్గెట్ చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా అవినీతిమయం అన్నారు. తన అవినీతితో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకు పోయిందన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఓటమి బాటన పట్టిస్తున్నారన్నారు. అగస్టా కుంభకోణం అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని మోడీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ప్రధాని పైన రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు స్పందించరని నిలదీశారు. కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతిమయమని ఆరోపించారు. టీఆర్పీ రేటింగుల కోసం మీడియా రాహుల్‌ను చూపించవద్దన్నారు.
కుంభకోణాలన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందన్నారు. తన వైఫల్యాన్ని రాహుల్ గాంధీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ గంగానది అంతటి పవిత్రమైన వారు అన్నారు. రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పైన ఉన్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications