వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌కు ఇండియా వార్నింగ్: డేటా చోరీ చేస్తే చర్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌ను హెచ్చరించారు. భారతీయ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్చకు, భావ ప్రకటన స్వేచ్చకు తాము అడ్డం కాదన్నారు. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు.

Ravi Shankar warns Facebook of strong action if it sways poll process

దేశంలో సుమారు 20 కోట్ల మంది భారతీయులు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని ఆయన చెప్పారు.

ఐటీ చట్టం కింద మాకు కఠిన చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టం కింద భారత్‌కు రప్పించడానికి మీకు సమన్లు జారీ చేయడం సహా పలు చర్యల్ని తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍‌బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈఓను హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Information Technology Minister Ravi Shankar Prasad on Wednesday attacked the Congress for its alleged links with data analysis firm Cambridge Analytica, which is accused of misusing data sourced from Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X