RBI website:"రూ.2వేల నోటు వెనక్కి" ప్రకటనతో ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు చాలామంది నెటిజెన్లు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.

రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన చేసింది. అయితే రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని పేర్కొంది. అదే సమయంలో రూ.2000 నోట్లను బ్యాంకులు ఇవ్వకుండా నిలువరించాలని అది ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది.

ఇక ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు కానీ ఫెసిలిటీ సెంటర్లు కానీ ఆయా బ్యాంకుల్లో ఉంచాలని పేర్కొంది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు 2023 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. రూ.2000 నోటును ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. అయితే ఒకేసారి రూ.20వేలు విలువ చేసే రూ.2వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు అనుమతించింది.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications