యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్- ఆస్పత్రులు, విద్యాసంస్ధలకు 5 లక్షల వరకూ చెల్లించేలా..
దేశంలో ఆన్ లైన్ చెల్లింపులు ఏటికేడాది పెరుగుతున్నాయి. అదే సమయంలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆర్బీఐ యూపీఐ చెల్లింపు విధానంలో ఎప్పుటికప్పుడు సమీక్షలు జరుపుతూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులు, విద్యాసంస్ధలకు చేసే చెల్లింపుల పరిమితిని భారీగా పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం వెలువరించింది.
దేశంలో యూపీఐకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ రెండు ప్రకటనలు చేశారు. ఇందులో మొదటిది ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి ఓ ప్రత్యేక నిర్ణయం కాగా.. మరొకటి యూపీఐ వ్యవస్ధకు సంబంధించింది మరొకటి ఉంది. మొదటి నిర్ణయం ప్రకారం ఇకపై ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చేసే చెల్లింపులను ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పెంచారు. విద్య, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం ఎక్కువ మొత్తంలో యూజర్లు చెల్లింపులు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

మరోవైపు కొన్ని నిర్ణీత వర్గాలకు చేసే రిపీటెడ్ చెల్లింపుల కోసం ఆన్ లైన్ ఈ- ఇన్ స్ట్రక్షన్ పరిమితిని కూడా పెంచుతూ ఆర్బీఐ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌లు ఉన్నాయి. ఇలా రిపీట్ పేమెంట్స్ చేసే పరిమితిని లక్ష రూపాయలకు పెంచారు. ప్రస్తుతం 15 వేలకు మించి తరచుగా చేసే పేమెంట్స్ కు అదనపు ప్రామాణీకరణ అవసరం అవుతుంది. దీన్ని ఇప్పుడు లక్షకు పెంచారు.












Click it and Unblock the Notifications