వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ: బ్యాంకుల షేర్లకు సానుకూలం

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత రిజర్వు బ్యాంక్ పరపతి విధానాన్ని ప్రకటించింది. గురువారం ఆర్బీఐ చేపట్టిన త్రైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.0 శాతంగా, రివర్స్ రెపో రేటును 5.75శాతంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.

కాగా, బ్యాంక్ రేటు 6.25శాతంగా ఉంది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యులు ఐదుగురు యథాతథానికి ఓటు వేయడంతో కీలక వడ్డీరేట్లలో మార్పులు చోటు చేసుకోలేదు. మైఖేల్ పాత్రో ఒక్కరే వడ్డీరేటు పెంపు వైపు మొగ్గు చూపారు.

RBI maintains status quo, keeps repo rate unchanged at 6%

ఈ నేపథ్యంలో నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ దోరణి కనిపిస్తోంది. కాగా, తొలి క్వార్టర్ లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4శాతం నుంచి 5.1శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

2018-19లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.4శాతంగా నమోదు కావచ్చని విశ్లేషించింది. ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్బీఐ నిర్ణయంపై ప్రభావితం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
The RBI Governor Urjit Patel-led monetary policy committee (MPC) on Thursday maintained status quo on the short-term lending rate -- repo rate -- at 6 per cent, in its first bi-monthly policy review of 2018-19. Five of six members voted in favour of the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X