వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

RBI Policy: MPC Cuts Repo Rate By 25 BPS To 6.25% | Oneindia Telugu

రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో రివర్స్ రెపోరేట్‌ కూడా 6శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలిసమావేశంలోనే శక్తికాంత దాస్ రెపోరేట్‌పై నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక మిగతా వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయని శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేట్లు తగ్గడంతో గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

RBI Policy: MPC cuts repo rate by 25 basis points to 6.25%

ఇదిలా ఉంటే ద్రవ్యపరపతి విధానంను సమీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రెపో రేట్ తగ్గింపునకు బృందంలోని నలుగురు సభ్యులు అనుకూలతను వ్యక్తం చేయగా మరో ఇద్దరు సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసలిటీ కింద రివర్స్ రెపో రేట్ కూడా 6శాతానికి చేరుకుంది. మరోవైపు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7.4 శాతంగా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.

వృద్ధిని ప్రభావితం చేస్తున్న అంశాలపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టడీ చేసింది. కమర్షియల్ రంగాల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు తరలి వెళుతుండటంతో ఆ రంగం బలంగా తయారువుతోందని ఆర్బీఐ వెల్లడించింది. క్రూడ్ ఆయిల్ ధరలు, బలహీనపడుతున్న రూపాయి విలువలు పెనుసవాల్‌గా మారునున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది.

English summary
The monetary policy committee cut repo rates by 25 basis points to 6.25 percent in its sixth bi-monthly monetary policy. Consequently, the reverse repo has come down to 6 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X