బిగ్ షాక్: Mastercard డెబిట్, క్రెడిట్ కార్డులపై RBI ఆంక్షలు -కొత్తవి జారీ చేయొద్దు -ఉన్నవాటికి నో ప్రాబ్లమ్
ఇండియా సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ 'మాస్టర్ కార్డ్'కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాకిచ్చింది. అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ సంస్థ తన భారతీయ వినియోదారుల డేటాను స్థానికంగానే(దేశంలోనే) పొందుపర్చాలన్న నిబంధనను పాటించని కారణంగా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం..
డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్‌పై చర్యలకు దిగిన ఆర్బీఐ.. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి వినియోగదారులను చేర్చుకోకుండా మాస్టర్ కార్డ్ పై ఆంక్షలు విధించింది. జులై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా, ఇప్పటికే మాస్టర్ కార్డ్ వాడుతోన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కొత్త కార్డుల జారీని మాత్రమే నిలిపేయాలని ఆదేశించినట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.

పౌరుల వ్యక్తిగత డేటాను మరింత సురక్షితం చేసేలా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసుల రంగానికి సంబంధించి మోదీ సర్కారు కొన్ని నిబంధనలను సవరించింది. దాని ప్రకారం.. దేశంలో ఆర్థిక సేవలు అందించే మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా కార్డ్ తదితర సంస్థలు ఇక్కడ జరిగే పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలనే నిబంధనను రూపొందించింది. ఆమేరకు 2018 ఏప్రిల్ లోనే ఆర్బీఐ మాస్టర్ కార్డ్ సహా అన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చింది. కాగా,

ఆర్బీఐ ఇచ్చిన గడువులోగా నిబంధనల పాలనలో విఫలం కావడంతో మాస్టర్ కార్డ్ పై ఆంక్షలు విధించారు. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007ను (పీఎస్‌ఎస్ చట్టం) అనుసరించి మాస్టర్ కార్డ్ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications