బాంబు పేల్చిన అనిల్ అంబానీ! టెలికాం రంగంలో 40 వేల ఉద్యోగాలు ఫట్!?
రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ పెద్ద బాంబు పేల్చారు. టెలికం రంగంలో ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ పెద్ద బాంబు పేల్చారు. టెలికం రంగంలో ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది ఈ రంగంలో 10 వేల ఉద్యోగాలు పోయానని తెలిపారు. పన్నుల కారణంగా టెలికం రంగంపై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉందన్నారు.

బ్యాంకు రుణాల మొత్తం రూ.2.8 లక్షల కోట్లకు చేరుకున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. జూలై 1 నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో మూడేళ్ల మారటోరియం ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
ఇటీవల ఆర్‌కామ్ రేటింగ్ నేల చూపులు చూస్తుండడంపై విలేకరులు ప్రశ్నించగా స్పందించిన అనిల్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.












Click it and Unblock the Notifications