వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్ షేర్లు.. ఒకవైపు జియో దెబ్బ, మరోవైపు...

రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) షేర్లు మరోసారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) షేర్లు మరోసారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది.

బుధవారం నాటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది.

RCom shares dip after Moody's, Fitch downgrade credit ratings again

అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు అనిల్ అంబానీ కంపెనీ ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను నమోదు చేసిన ఆర్ కామ్ ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది.

రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి.

కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి.

ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది.

వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. మరోవైపు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్ కామ్ నికర రుణం రూ.45 వేల కోట్లకు పెరిగింది.

English summary
Shares of Reliance Communications tanked over 4% on Wednesday after the rating agencies Fitch and Moody's on Tuesday downgraded credit rating of the company on account of its fragile liquidity position and limited ability to pay back debt.The stock hit an intraday low of Rs 19, down 4.2% on the BSE. RCom has fallen over 24% since the company reported loss of Rs 948 crore for the fourth quarter, hurt by intense price war unleashed by newcomer Reliance Jio. It had registered net profit of Rs 79 crore in the corresponding quarter of the previous fiscal year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X