కాఫీ షాప్‌లో అందరూ చూస్తుండగానే రియాల్టర్ హత్య

బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు జయానగర్‌లోని ఓ కాఫీ షాపులోకి సాయుధులుగా చొరబడిన కొందరు దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహేశ్ అలియాస్ మోటా(30) అనే రియల్టర్ బెంగళూరులోని విజయానగర్ ప్రాంతంలో రాత్రి 7.40గంటలకు తన స్నేహితుడితో కలిసి కేఫ్ కాఫీ డే షాపులోకి వెళ్లాడు. అక్కడే అతడు కాఫీ తాగుతుండగా ఆయుధాలతో వచ్చిన నలుగురు దుండగులు అతడిపై దాడి చేశారు.

Realtor hacked to death in coffee shop at Vijaya Nagar

దీంతో తీవ్రగాయాలపాలైన మహేశ్ అక్కడికక్కడే చనిపోగా.. రక్షిత్ అనే తన స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత దుండగులు పరారయ్యారు. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరుగుతున్న సమయంలో కాఫీ షాప్‌లో ఉన్న కస్టమర్లు భయంతో బయటికి పరుగులు తీశారు.

కాగా, హత్యకు గురైన మహేశ్‌పై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వ్యక్తిగత కక్షతోనే ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+